నిర్మల్ జిల్లాలో గణపతి నవరాత్రి ఉత్సవాలను శాంతియుతంగా, మత సామరస్య వాతావరణంలో నిర్వహించాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో హిందూ ఉత్సవ శాంతి కమిటీ సభ్యులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఉత్సవ నిర్వాహకులు, పోలీసులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని కోరారు.