తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో పలు నియోజకవర్గాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొని, పార్టీ భవిష్యత్ కార్యక్రమాలపై చర్చించారు. సమావేశం అనంతరం పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలిశారు. నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు.