సెప్టెంబర్ 13 వ తేదీన జాతీయ లోక్ అదాలత్ ను కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట ఎస్పీ యోగేష్ గౌతం మంగళవారం 2 గం. సమయంలో ఒక ప్రకటనలో తెలిపారు. వివాదాలు అనేవి పెంచుకోవాలనుకుంటే జీవితకాలం కొనసాగుతాయని,ఇంతటితో కలిసి ఉంటామని ఒక నిర్ణయానికి వస్తే ఇప్పుడే అవి సమిసిపోతాయని రాజీ మార్గమే రాజ మార్గమని అన్నారు. జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా పేట జిల్లాలో వివిధ రకాల రాజీపడదగు కేసుల లోని కక్షిదారులకు విజ్ఞప్తి చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఉచిత న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 13 వ తేదీన పేట, కోస్గి కోర్టులలో నేషనల్ లోక్ అదాలత్ సందర్భంగా కక్షి దారులకు అందుబాటులో ఉంటారని తెలిపారు.