తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సీఎం సహాయ నిధి నిరుపేదల పాలిట వరమని తెలిపారు. తాడిపత్రిలోని తన క్యాంపు కార్యాలయంలో 45 మంది లబ్ధిదారులకు రూ.33,88,030 విలువైన చెక్కులు అందజేశారు. లబ్ధిదారులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.