ఈ నెల 17 న దేశ ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను గ్రామ గ్రామాన ఘనంగా నిర్వహించాలని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్మల్ రూరల్ మండల సేవా పక్వాడ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 2 వరకు ప్రతీ మండల కేంద్రంలో పార్టీ ఆదేశాల మేరకు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఇందులో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, సేవా పక్వాడ్ జిల్లా కన్వీనర్ మెడిసెమ్మే రాజు, నాయకులు ముత్యం రెడ్డి, జమాల్, అలివేలు మంగ, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.