వైజాగ్ వాసులకు నోరూరించే విందు సిద్ధమైంది. బీచ్ రోడ్‌లోని ఎంజీఎం మైదానంలో శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు వైజాగ్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. ఆహార ప్రియుల కోసం ఈ వేడుకను పర్యాటక శాఖ, హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.ఈ పండుగలో 40కి పైగా స్టాల్స్‌లో సరికొత్త రుచులు కొలువుదీరనున్నాయి. ఆంధ్రా సంప్రదాయ వంటకాల నుంచి అంతర్జాతీయ మెనూల వరకు, గోదావరి రుచుల నుంచి ఆర్గానిక్ పదార్థాలతో తయారు చేసిన ప్రత్యేక వంటకాల వరకు అన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ తినుబండారాల వేడుక జరుగుతుంది.