కళాశాల విద్యార్థుల వివరాలను యు డైయిస్ పోర్టల్ లో నమోదు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ అధికారి దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం ASF జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో విద్యార్థుల వివరాలను యు డైయిస్ పోర్టల్ లో నమోదు, ఫేస్ రికగ్నైజేషన్ సిస్టం (ఎఫ్.ఆర్.ఎస్.) పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 44 ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల జూనియర్ కళాశాలలు ఉన్నాయని, కళాశాలలలో విద్య అభ్యసించే ప్రధమ, ద్వితీయ, ఒకేషనల్ విద్యార్థుల వివరాలను యు డైయిస్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు.