This browser does not support the video element.
రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల్లో వైద్యారోగ్యశాఖాధికారులు పర్యవేక్షణలో వైద్యశిబిరాలు
Rampachodavaram, Alluri Sitharama Raju | Sep 8, 2025
రంపచోడవరం నియోజకవర్గంలో రాజవొమ్మంగి మండలంలోని లబ్బర్తి, లాగరాయి, కిండ్ర గ్రామాల్లో వైద్యారోగ్యశాఖాధికారులు పర్యవేక్షణలో సోమవారం ప్రత్యేక వైద్యశిబిరాలను నిర్వహించారు. ఈ మూడు గ్రామాల్లో ప్రజలు గత కొద్ది రోజులుగా అనారోగ్యానికి గురై ప్రైవేటు ఆసుపత్రిలలో లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని పలు కథనాలు సామాజిక మాద్యామాల్లో వార్తలు రావడంతో రంపచోడవరం డివిజన్ వైద్యారోగ్యశాఖాధికారులు స్పందించి ఈ మూడు గ్రామాల్లో ప్రత్యేక వైద్యశిభిరాలను నిర్వహించి 105 మంది వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించారు.