విజయవాడ న్యూ రాజరాజేశ్వరి పేటలో డయేరియా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. శుక్రవారం న్యూ రాజరాజేశ్వరి పేట లోని డయేరియా వైద్య శిబిరం వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు.. డయేరియా ఘటన జరిగి నాలుగు రోజులైనా దేని కారణంగా డయేరియా వచ్చిందో ప్రభుత్వం తేల్చలేకపోతుందన్నారు. డయేరియా వ్యాప్తిని అరికట్టడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు