ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి మండలంలోని దిగువమెట్ట తాండ గ్రామంలో జలజీవన్ మిషన్ పనులను ప్రారంభించారు. తండాలో నివసిస్తున్న ప్రజల నీటి సమస్యను పరిష్కరించేందుకు రూ.7.6 లక్షలతో నూతన మంచినీటి పైపు లైన్ నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తెలిపారు. పనులను స్థానిక నాయకులు కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తికి మించి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు.