డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్సు 5 నెలలుగా పెండింగ్లో ఉన్న జీతాలను ప్రభుత్వం విడుదల చేయాలని ఆదివారం కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ సీఐటీయు గౌరవ అధ్యక్షుడు ఏసుదాసు తెలిపారు.ఈ సందర్బంగా ఆయన జమ్మలమడుగు మస్టర్ పాయింట్ వద్ద మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల సెక్యూరిటీ గార్డ్స్ కు కొత్త అగ్రిమెంట్ ప్రకారం రూ.18,600 ఇవ్వాల్సి ఉండగా.. కేవలం రూ.7,000 నుంచి రూ.8000 మధ్యన ఇస్తున్నారని ఆరోపించారు.