కోడుమూరు మండల వ్యాప్తంగా పలుచోట్ల వినాయక విగ్రహాల నిమజ్జనం శుక్రవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. కోడుమూరు, వర్కూరు, కృష్ణాపురం, వెంకటగిరి, బైనదొడ్డి, గోరంట్ల, లద్దగిరి తదితర గ్రామాల్లో మూడు రోజులపాటు పూజలు నిర్వహించారు. ప్రజలు సంతోషాల మధ్య వీధుల్లో ఊరేగించారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు. విగ్రహాలపై అలంకరించిన వస్తువులను నిర్వాహకులు వేలం చేపట్టారు. మండలంలో నిమజ్జన వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.