భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఇల్లందు క్లబ్ హౌస్ లో శనివారం రాత్రి 8 గంటలకు జీఎం రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన తేనె తీగల పెంపకం కిట్లపంపిణీ కార్యక్రమంలో సింగరేణి సిఎండి బలరాం నాయక్ ,ఎమ్మెల్యే గండ్ర, జిల్లా కలెక్టర్ రాహు శర్మ పాల్గొని వంద మంది మహిళలకు కిట్లను పంపిణీ చేసినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర,సీఎం డి బలరాం నాయక్ మాట్లాడుతూ నిరుద్యోగులు, భూ నిర్వాసితులకు ఉపాధి కల్పన లక్ష్యంగా సింగరేణి సంస్థ పనిచేస్తుందని 100 మంది మహిళలకు కిట్లు అందించామని,రానున్న రోజుల్లో మరింత మందికి ఉపాధి కల్పిస్తామన్నారు.