మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సేవలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేయాలని నగరపాలక కమిషనర్ పి.విశ్వనాథ్ స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ నగరపాలక కార్యాలయంలోని పలు విభాగాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి విభాగం సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే వారిలో అసంతృప్తి పెరుగుతుందన్నారు. కాబట్టి ఏ ఫైలు కూడా వాయిదా వేయకుండా, వెంటనే క్లియర్ చేయాలని సూచించారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులను సీరియస్‌గా పరిగణించి తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఫైళ్ల పరిష్కారంలో నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరి