ఎల్బీనగర్ లో రెడ్డి జన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించే కార్యక్రమాన్ని ఆదివారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి పాల్గొని విద్యార్థులకు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాన్ని పక్కనపెట్టి విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమని తెలిపారు. రెడ్డి జన సంఘం నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 26 లక్షల స్కాలర్షిప్లను అందజేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.