జగిత్యాల జిల్లాలో శునకాలు దాడులు చేస్తున్న ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. చిన్న, పెద్ద తేడాలేకుండా దాడులు చేసి గాయపరుస్తున్నాయి. తాజాగా ఆదివారం రోజున ఓ మేకల మందపై దాడి చేయడంతో 13 మేకలు మృతి చెందాయి. ఈ ఘటన బుగ్గారం మండలం సిరికొండ గ్రామంలో చోటుచేసుకుంది.నక్క కొమురయ్య అనే మేకల కాపరి రోజులానే మేకలను మేతకు తీసుకు వెళ్లి వచ్చి తన దొడ్డిలో తోలాడు. అర్థరాత్రి తర్వాత మేకల మందపై ఒక్కసారి కుక్కలు దాడి చేసాయి. దీంతో 13 మేకలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డాయి. మేకల మృతితో యజమాని కన్నింటిపర్యంతం అయ్యాడు.