నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన శోభాయాత్ర ఆదివారం రాత్రి వరకు కొనసాగింది. పట్టణ పురవీధుల గుండా బాజా భజంత్రీల నడుమ ఊరేగింపు నిర్వహించి పార్వతి తనయుడిని స్థానిక బంగల్ పేట్ వినాయక సాగర్ చెరువులో నిమజ్జనం చేశారు. వినాయక సాగర్ వద్ద ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేలా అధికారులకు సహకరించిన గణేష్ మండపాల నిర్వాహకులకు ఉత్సవ సమితి సభ్యులు ప్రత్యేక అభినందనలు తెలిపారు.