నంద్యాల జిల్లా బేతంచెర్ల శ్రీనగర్ కాలనీలో మంగళవారం విద్యుత్ తీగలు కిందికి వేలాడుతూ నిప్పురవ్వలు వచ్చాయి. గమనించిన స్థానికులు వెంటనే లైన్ ఇన్స్పెక్టర్ నిరంజన్ బాబుకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మొదట కాలనీకి సంబంధించిన కరెంటును నిరంజన్ బాబు నిలిపివేశారు. లైన్మెన్ ఖలీల్, జేఎల్ఎం మాలిక్ వచ్చి కరెంటు తీగలను సరిచేయడంతో ప్రమాదం తప్పింది.