ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలానికి అద్దంకి మీదుగా ఉన్న ఆర్టీసీ బస్సు నిలిచిపోయింది. దీంతో మహిళ స్త్రీ శక్తి పథకం ద్వారా పునరుద్ధరించాలని ఇటీవల బొద్దికూరపాడు మహిళలు ఆర్టీసీ అధికారుల ను కోరారు. దీంతో వెంటనే స్పందించిన అధికారులు సమస్యను పరిష్కరించినట్లు మహిళలు తెలిపారు. దీంతో గ్రామస్తులు ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.