సోమవారం సాయంత్రం 6:00 సమయం ఏలూరు జిల్లా లోని మాదేపల్లి పంచాయతీ లింగారావు గూడెం గ్రామంలో ఇంటి ముందు నిలిపి ఉంచిన ట్రాక్టర్ ను దొంగలించారని ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీస్ అధికారులు. ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్. పలు సీసీటీవీ లను పరిశీలించిన పోలీసు అధికారులు ట్రాక్టర్లు అమ్మడానికి తీసుకువెళ్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి దొంగిలింపబడిన ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యన్నం హరినాథ్, మదన రవీంద్రనాథ్ రెడ్డిగా పోలీసులు గుర్తించారు.