నల్లగొండ జిల్లా: కేంద్ర ప్రభుత్వం నిత్యవసర వస్తువుల పై జిఎస్టి రేట్లు తగ్గించడంతో నల్లగొండ జిల్లా బిజెపి ఆధ్వర్యంలో నకిరేకల్ పట్టణంలోని పాలాభిషేకం చేపట్టారు. ఈ సందర్భంగా నకరేకల్ పట్టణంలోని బిజెపి పట్టణ అధ్యక్షులు మురళి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించడానికి స్వాగతిస్తున్నామన్నారు .మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు మోడీ తీసుకున్న ఈ ప్రజాహిత నిర్ణయానికి మద్దతుగా ఈ కార్యక్రమం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.