ప్రభుత్వం నిర్ణయించిన దసరా సెలవులు 24 సెప్టెంబర్ నుండి 2 అక్టోబర్ వరకు ఉన్నా, విజయవాడలో కనకదుర్గమ్మ ఉత్సవాలు 22 నుంచే ప్రారంభం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు, ప్రజలకు ఇబ్బందులు తలెత్తవచ్చని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ పేర్కొంది.సెలవులను 22 సెప్టెంబర్ నుండి 3 అక్టోబర్ వరకు పొడిగించాలని కోరుతూ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు శ్రీనివాసరాజు నేతృత్వంలో ప్రతినిధి బృందం SCERT డైరెక్టర్ వెంకట కృష్ణరెడ్డికి వినతిపత్రం అందజేసింది.ఈ కార్యక్రమంలో జె. శ్రీనివాస్‌రావు, తరిగొండ సురేష్‌కుమార్, డా. జయప్రకాశ్ నాయుడు, చంటి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.