2022 న అప్పటి ప్రభుత్వం నార్సింగి మండల విద్యాధికారి కార్యాలయ భవన నిర్మాణానికి పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నిధుల నుంచి 40.7 లక్షల నిధులు మంజూరు చేసారు. అప్పట్లో నిర్మాణానికి నోచు కోకుండా రెండు నెలల క్రితం భవన నిర్మాణానికి స్థానిక తహశీల్దార్ భూమిని మంజూరు చేయగా, ఎంఈఓ గంగా బాయి, ఏఈ, నాయకులు తదితరుల సమక్షంలో భూమి పూజ నిర్వహించి నిర్మాణం మొదలు పెట్టారు. కాంట్రాక్టర్ భవన పునాదుల నిర్మాణం కోసం గుంతలు కూడా తీశారు. కొందరు భవనానికి దారి కోసం పేచీ పెట్టారు. దారి ఇటు నుంచి ఇవ్వాలంటే అటు నుంచి అంటూ అభ్యంతరం తెలుపడం తో భవన నిర్మాణం ఆగిపోయింది.