అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని సీఐటీయు జిల్లా అధ్యక్షుడు సి.హెచ్.అమ్మన్నాయుడు, జిల్లా ఉపాధ్యక్షుడు మణికొండ. ఆదినారాయణమూర్తి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె.కళ్యాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నగర మహాసభ ఎన్.జి.హోమ్లో ఆదివారం జరిగింది. సెప్టెంబరు 14న పాతపట్నంలో జరిగే అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.