భూపాలపల్లి మండలం పెద్దాపూర్ గ్రామ రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారు పెద్దాపూర్ గ్రామపంచాయతీ పిఎసిఎస్ రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం ఉదయం నుండి వేచి చూస్తున్నామని రైతులుగురువారం ఉదయం 11 గంటలకు తెలిపారు.యూరియా డి సి ఎం లోడ్ రావడం తో ఒక్కసారిగా ఎగబడ్డ రైతులు, ఘర్షణ వాతావరణం నెలకొనడంతో ఎస్ఐ రాజు చేరుకొని రైతులకు నచ్చజెప్పి క్యూ లైన్ లో నిలబెట్టారు. ఎక్కువమంది రైతులు కావడంతో ఒకే బస్తా ఇస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు సరిపడా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు.