జిల్లాలోని కొన్ని గ్రామాల్లో సీజనల్ ఫీవర్ కేసులు ఉన్నప్పటికీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ తమీమ్ అన్సారియా మీడియాతో బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు అన్నారు. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. సీజనల్ జ్వరాలు వస్తే డాక్టర్లు, మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఎవరికి జ్వరం వచ్చినా మెడికల్ టీం రెడీగా ఉందని, గ్రామానికి వెళ్లి వైద్యం అందిస్తుందని అన్నారు. మందులు కూడా ఉచితంగానే ఇస్తామన్నారు.