భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ,గోరికొత్తపల్లి మండలాల్లో బుధవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు 14 కోట్ల 75 లక్షల రూపాయల నీళ్లతో అంతర్గత రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు ఎమ్మెల్యే గండ్ర తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోనేఆదర్శ నియోజకవర్గంగా భూపాలపల్లిని తీర్చి దిద్దుతామని,ఈ నేపథ్యంలోనే అంతర్గత రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ .అధికారులు,పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.