శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో ఎమ్మెల్యే కూన రవికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన స్త్రీ శక్తి భారీ బహిరంగ సభకు ఆముదాలవలస బ్రిడ్జి నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. భారీ సంఖ్యలో మహిళలు సోమవారం సాయంత్రం ఈ సభలో పాల్గొన్నారు కూటమి ప్రభుత్వంలో మహిళల కోసం చేపట్టిన గొప్ప కార్యక్రమం స్త్రీ శక్తి అని సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీలోని మహిళలను మహారాణులను చేశారని భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మహిళల ఆర్థిక తోడ్పాటుకు మరింత కృషి చేస్తామని, తెలిపారు..కూటమి ప్రభుత్వంలో మహిళలకు మరిన్ని పథకాలను అమలు చేస్తామని ఈ ఘనత సీఎం చంద్రబాబుదేనని ఆయన తెలిపారు.