Download Now Banner

This browser does not support the video element.

వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఎ శ్యాంప్రసాద్

Parvathipuram, Parvathipuram Manyam | Aug 19, 2025
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాల ప్రభావిత ప్రాంతాలలో పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ పర్యటించారు. మంగళవారం ఆయన సాలూరు నియోజకవర్గం పరిధిలోఉన్న మక్కువ మండలంలోని దుగ్గేరు, గుంటభద్ర, పనసభద్ర తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వాగులు, వంకల వద్ద వరద ప్రభావాన్ని సమీక్షించారు. పంట, ఆస్తి నష్టం జరిగిందా అని అధికారులతో ఆరా తీశారు. స్థానికులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us