ఎమ్మెల్యే మురళి నాయక్ క్యాంపు కార్యాలయాన్ని యూరియా కోసం రైతులు ముట్టడించారు. ఈ క్రమంలో రైతులను పోలీసులు అడ్డుకున్నారు. తమకు మద్దతు ఇవ్వమని పోలీసులను రైతు వేడుకున్నారు. ఎమ్మెల్యే బయటకు రావాలంటూ క్యాంపు కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. రైతులు, మహిళలు క్యాంపు కార్యాలయం వద్దకు చేరుకున్నారు. మహబూబాబాద్ వ్యవసాయ ఆధికారి రైతులు చుట్టుముట్టారు రైతులకు సరిపడా యూరియా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.