షాద్నగర్ పట్టణంలోని ముఖ్య కూడలిలో వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మంగళవారం ఉదయం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ పేద ప్రజల గుండెల్లో వైయస్ రాజశేఖర్ రెడ్డి చెరగని ముద్ర వేశారని అన్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి అందించిన సేవలు నేటి ప్రజల స్మృతిలో నిలిచాయని పేద కుటుంబాలకు ప్రాణదాతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిచారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.