రాజ్యాంగ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని జన్నారం మండల బీసీ సంఘం నాయకులు కోరారు. హైదరాబాద్లో బీసీ సంఘం నేత ఆర్ కృష్ణయ్య చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహనికి బీసీ కులస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ బీసీ జనాభాకు అనుగుణంగా రిజర్వేషన్లను కోరుతున్నామని,అది కూడా స్థానిక సంస్థల ఎన్నికల నుంచే అమలు చేయాలన్నారు. బీసీల రాజకీయ,ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలని కోరారు.