ముఖ్యమంత్రి చంద్రబాబు 330 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకు నీళ్లు తీసుకెళ్లారు. 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న కళ్యాణదుర్గానికి ఎందుకు నీళ్లు తీసుకురాలేదని కళ్యాణదుర్గం వైసీపీ సమన్వయకర్త మరియు మాజీ ఎంపీ తలారి రంగయ్య ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అనంతపురంలో సూపర్ సిక్స్ సభను పెట్టారు సరే జిల్లాను ఏమి అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేలందరూ మద్యం వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. మద్యం బెల్టు షాపులు ఎమ్మెల్యేల కను సన్నుల్లోనే జరుగుతున్నాయన్నారు. ఇంకా అనేక విషయాలను లేవనెత్తారు.