Araku Valley, Alluri Sitharama Raju | Aug 22, 2025
గూడెం కొత్తవీధి మండలం నేలపాడు గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఆసుపత్రికి తరలించాలంటే డోలీమోత తప్పదన్నారు. దీంతో గ్రామస్తులు సొంతంగా శ్రమదానంతో కాలిబాట ఏర్పాటు చేసుకుంటున్నామని తెలిపారు. అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు.