అభివృద్ధి విషయంలో బిజెపి, బీఆర్ఎస్ పార్టీల నాయకులతో బహిరంగ చర్చకు సిద్ధమని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సవాల్ విసిరారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం మంచిర్యాల పట్టణంలోని ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఘాటుగా స్పందించారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచిర్యాల నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి హైదరాబాదుకు సరి సమానంగా నిలబెడతానని అన్నారు. అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంది కాబట్టే తనపై కొందరు నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారనీ తెలిపారు.