అనంతపురం నగరంలో పట్టపగలు ఓపెన్ బార్ తెరిచేశారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నగరపాలక సంస్థ పరిధిలోని బళ్లారి బైపాస్ సమీపంలో ఉన్న బ్రిడ్జి కింద సోమవారం ఉదయం ఏడు గంటల 30 నిమిషాల సమయంలోనే ఏకంగా మద్యం ప్రియులు ఓపెన్ బార్ ఓపెన్ చేశారు. అటు నుంచి వెళ్లేవారు చూసి తీవ్ర ఇబ్బందికరంగా భావిస్తున్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న పార్క్ వారికి ఓపెన్ బార్ గా మారింది. ఇప్పటికైనా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.