గాజువాక నియోజకవర్గం 87వ వార్డు పరిధిలో తిరుమల నగర్ ప్రాంతానికి చెందిన లొల్ల రామారావు,లొల్ల లలిత లకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డు కార్పొరేటర్ బోండా జగన్నాథం (జగన్) ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులు మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ప్రజలకు కష్టం ఎదురైనప్పుడు వారి కుటుంబానీకి పెద్ద కొడుకుగా ఆదుకుంటానని మాట ఇచ్చారని ఆ మాట నిలబెట్టుకుంటూ ఆసుపత్రి ఖర్చు కోసం తన వంతు సహాయం అందజేస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు.