రాష్ట్ర క్యాబినెట్లో తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లి భూ సమస్య పరిష్కరించడాన్ని సిపిఎం స్వాగతిస్తోందని తిరుపతి యశోద నగర్ లో జరిగిన నగర కమిటీ సమావేశంలో గురువారం జిల్లా కార్యదర్శి నాగరాజు అన్నారు 7 దశాబ్దాలుగా సాగుతున్న ఈ సమస్యకు పరిష్కారం లభించడం సంతోషకరమని అన్నారు బాధితుల సమస్యను సానుకూలంగా పరిష్కరించడానికి కృషి చేస్తున్న తిరుపతి జిల్లా కలెక్టర్ రాజకీయ పార్టీలకు సిపిఎం నేతలకు ఆయన అభినందనలు తెలిపారు.