ముమ్మిడివరం పరిధిలోని ఎదుర్లంక - యానాం బాలయోగి వారధిపై నుండి యానాం గోపాల్ నగర్ కు చెందిన ఓ మహిళ ఆదివారం గోదావరిలోకి దూకబోయింది. ఆసమయంలో మోటార్ సైకిల్ పై అటుగావెళ్తున్న స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ నాగరాజు గమనించి మహిళ చెయ్య పట్టుకోగా, అటుగా వెళ్తున్న మరో నలుగురి సాయంతో ఆ మహిళలను రక్షించారు. భార్యా, భర్తల వివాదమే మహిళ ఆత్మహత్యకు కారణంగా గుర్తించి, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి బందువులకు అప్పగించారు.