మోపిదేవి తహసీల్దార్ హరనాథ్, బుధవారం మోపిదేవి ప్రధాన వీధిలో డ్రగ్స్ పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. చిన్న వయసులోనే గంజాయి, ఇతర వ్యసనాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అవలంబించాలని కోరారు. ఈ ర్యాలీలో పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.