జిల్లా కేంద్రమైన విజయనగరం పట్నంలోని ప్రభుత్వ డైక్లో కళా ఉత్సవ 2025 వేడుకల ముగింపు కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. ఇందులో ముఖ్యఅతిథిగా డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణారావు మాట్లాడుతూ ఎన్నడూ లేని విధంగా రెండు రోజుల్లో 248 మంది విద్యార్థులు కళా ఉత్సవంలో ఉత్తమ ప్రదర్శన ఇచ్చారని చెప్పారు. కళా ఉత్సవ్ 2025 మోడల్ అధికారి వాకా చిన్నం నాయుడు మాట్లాడుతూ జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విద్యార్థులు అజయ్ విజయవంతంగా కార్యక్రమం ముగించారన్నారు. కార్యక్రమంలో నటుడు దర్శకుడు ఈపు విజయ్ కుమార్, జడ్జీలు గా అప్పయ్య ప్రసాద్ నారాయణమూర్తి వ్యవహరించారు.