బంగారు పాల్యం మండలం వెలుతురుచేను గ్రామానికి చెందిన 70 ఏళ్ల సుందరం కుటుంబంపై దాడి ఘటన చోటుచేసుకుంది. ఆగస్టు 14న శారద, వేలు కుమారుడు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో, అతని మరణానికి సుందరం కుటుంబమే కారణమని భావించి శారద, వేలు మరికొందరు గడ్డపారులు, కట్లతో దాడి చేసి, పక్కనే ఉన్న గడ్డివాముకు నిప్పు పెట్టారు. ఈ సంఘటనపై బంగారుపాళ్యం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.