గుత్తి మండలం శ్రీపురం గ్రామంలో పొలంలో ఆముదం పంటకు మందును పిచికారీ చేస్తూ యువరైతు అరవింద్ అస్వస్థతకు గురయ్యాడు. బుధవారం అరవింద్ పొలానికి వెళ్లి ఆముదం పంటకు మందు పిచికారీ చేస్తున్న సమయంలో ముక్కుల్లోకి మందు పోవడంతో అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే గుత్తి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే వైద్యం అందించారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.