ఇసుక అధిక లోడుతో లారీ నడపవద్దని పలుమార్లు సూచించినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రశాంతి హెచ్చరిక జారీ చేశారు .శుక్రవారం రాజమండ్రిలో మాట్లాడుతూ ఇసుక రవాణా విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని,వాహనంపై టార్పాలిన్ కప్పడం తప్పనిసరన్నారు. అధికారులు ఎంత అవగాహన కల్పించినా కొందరు ఉల్లంఘనలకు పాల్పడటం విచారకరం అన్నారు ఈ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి ఇసుక రవాణా చేస్తున్న లారీని గమనించిన కలెక్టర్, జిల్లా రవాణా అధికారి సురేష్‌కు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ,