తిరుపతి లక్ష్మీపురం సర్కిల్ సమీపంలోని గరుడ వారధి పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంలో వెళ్తున్న ఇరువురు విద్యార్థులు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో మోహన్ బాబు కళాశాలలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి చక్రధర్ మృతి చెందగా ద్విచక్ర వాహనంలో వెనుక కూర్చున్న వేదాంత అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న ఈస్ట్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులు ఆసుపత్రికి తరలించారు ప్రమాద ఘటనపై ఈస్ట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.