సంతబొమ్మాలి మండల పరిధిలోని భావనపాడు సముద్ర తీరంలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సముద్రంలో స్నానానికి దిగిన వీళ్లంతా.. అలల ఉద్ధృతికి సముద్రంలో కొట్టుకుపోయారు. గల్లంతైన వారు వజ్రపుకొత్తూరు మండలం పాత టెక్కలి పంచాయతీ మడేవానిపేటకు చెందిన దున్న దుర్యోధన, పూడి జగన్నాథపురం, ఒడిశా రాష్ట్రం తాడిపత్రికి చెందిన యువకులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. నౌపాడ పోలీసులు గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.