రాష్ట్రంలో యూరియా కొరతపై, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై వైసీపీ 'అన్నదాత పోరు' కార్యక్రమాన్ని సెప్టెంబర్ 9వ తేదీన నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అన్నదాత పోరు కార్యక్రమం పోస్టర్ ను ఎన్టీఆర్, కోనసీమ వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, చిర్ల జగ్గిరెడ్డి రావులపాలెం మండలం గోపాలపురంలో శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి బాబి, కోనసీమ రైతు విభాగం అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.