కడప జిల్లా బద్వేల్ పట్టణములోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం దివ్యాంగుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగ సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీ శక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణం సౌకర్యాన్ని కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది వరకు దివ్యాంగులు ఉంటే వారికి ఉచిత ప్రయాణం కల్పించడంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు.