జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో సచివాలయం వద్ద ఏర్పాటుచేసిన స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎంతో పగడ్బందీగా స్మార్ట్ రేషన్ రూపకల్పన చేసిందని,ఇప్పుడు వరకు ఉన్న రేషన్ కార్డులో ఆ కుటుంబానికి చెందిన సభ్యులందరితో ఫోటో ఉండేదని, ఇప్పుడు ఆ స్థానంలో కుటుంబ యజమాని ఫోటో ఉంటుందని తెలియజేశారు.