Mahadevpur, Jaya Shankar Bhalupally | Aug 24, 2025
భూపాలపల్లి అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ లో త్రాగునీటిలో విషపదార్థం కలపబడిన ఘటనపై భూపాలపల్లి మండల విద్యాధికారి అజ్మీరా దేవానాయక్ ఇచ్చిన పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన విషయం విదితమే. దర్యాప్తు ప్రక్రియలో నిందితుడిగా గుర్తించబడిన సైన్స్ టీచర్ పెండ్యాల రాజేందర్ ను ఈ రోజు అదుపులోకి తీసుకొని విచారణ జరిపి అరెస్ట్ చేసి నామని భూపాలపల్లి డి.ఎస్.పి సంపత్ రావు తెలిపారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి మాట్లాడుతూ, విద్యార్థుల ప్రాణాలకు ముప్పు కలిగించే ఈ తరహా దారుణ చర్యలకు పాల్పడిన వారిపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్ష ఉండదని, కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేసులో ఇతరుల